- Advertisement -
జగన్ బెయిల్ రద్దవుతుందా…
Will Jagan's bail be cancelled?
కడప, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
వైసీపీ అధినేత జగన్ కొత్త సమస్య ఏర్పడిందా? ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై జనవరి 10న తేల్చనుంది సుప్రీంకోర్టు. దీంతో ఆయన బెయిల్‌పై కంటిన్యూ అవుతారా? ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లడం మాటేంటి? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.జగన్ అక్రమాస్తుల కేసు ట్రయిల్ సరిగా జరగలేదని, ఆలస్యమవుతోందని గతంలో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లుగా జగన్ బెయిల్ ఉన్నారని, రద్దు చేయకుంటే విచారణ తీవ్ర జాప్యం జరిగే అవకాశముందని మరో పిటిషన్ దాఖలు చేశారు.రఘురామరాజు వేసిన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలు పరిశీలించాక తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం న్యాయస్థానానికి అందజేసినట్టు సీబీఐ లాయర్ వెల్లడించారు.సీబీఐ దాఖలు చేసిన స్టేటస్ కో రిపోర్టును తాము పరిశీలించాల్సి వుందని జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. జనవరి 10న న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి ఆ పార్టీ నేతల్లో మొదలైంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఓకే, ఒకవేళ రాకుంటే పరిస్థితి ఏంటన్న చర్చ అప్పుడే మొదలైంది.
- Advertisement -