పోసాని తర్వాత విడదల రజనీ…?
గుంటూరు, మార్చి 24, ( వాయిస్ టుడే)
Will Rajini leave after Posani...?
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఏసీబీ కేసులో విడదల రజనీతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ అధికారులను పంపించి బెదిరించి యడ్లపాడులోని స్టోన్ క్రషర్ నుంచి 2.20 కోట్ల రూపాయలు విడదల రజనీ బ్యాచ్ వసూలు చేసిందని ఏసీబీ ఆరోపిస్తుంది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతాో పాటు మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అనేక సెక్షన్లకింద నమోదయిన ఈకేసుల్లో ఏ2 నిందితురాలిగా విడదల రజనీ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చిననివేదిక ను ఆధారంగా చేసుకుని కేసు నమోదయింది. ఎక్కేది ఎప్పుడంటే? 2.20 కోట్లు తీసుకుని… 2020లో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. స్టోన్ క్రషర్ ను క్లోజ్ చేయకుండా ఉండాలంటే తమకు 2.20 కోట్ల రూపాయలు చెల్లించాలని బెదిరించడంతో దాని యజమానులు చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావులు రజనీని కలిసి చర్చించారు. తర్వాత రజనీ అనుచరులకు ఆ డబ్బులు చెల్లించినట్లు ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. డబ్బులు ఇవ్వడం ఆలస్యమయిందని భావించి, ఆగ్రహించి రజనీ విజిలెన్స్ అధికారుల చేత స్టోన్ క్రషర్ పై దాడులు కూడా నిర్వహించి దాని యజమానులను భయభ్రాంతులకు గురి చేసినట్లు కూడా ఫిర్యాదు అందింది. ఎవరి అనుమతి లేకుండానే విచారణ చేసిన అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను కూడా ఈకేసులో నిందితులుగా చేర్చారు.స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి యాభై కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ ను నిర్వహిస్తున్నారని విజిలెన్స్ అధికారుల బెదిరింపులకు దిగారన్నఆరోపణలున్నాయి. దీంతో భయపడిన స్టోన్ క్రషర్ యజమానులు రజనీని కలసి తమకు జరిమానా పడకుండా సాయంచేయాలని కోరగా, అందుకు ప్రతిగా 2.20 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. విడుదల రజినీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు రాగా తొలుత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్ గుప్తా విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక సిఫార్స్ మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు.లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది అయిన విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్ల పై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్స్ కు ఫిర్యాదు అందగా.. ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్ గుప్తా విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు.కేసు విషయానికి వస్తే.. ‘2020 సెప్టెంబరు 4న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ కండ్రికను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, స్టోన్ క్రషర్ ను మూయించకుండా ఉండాలంటే రజినిని కలవాలని ఆదేశించారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని ఆఫీసుకు వెళ్లి కలిశారు. వ్యాపారం సజావుగా జరగాలంటే అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలన్నీ తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారికి హుకుం జారీ చేశారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (ఆర్‌వీఈవో)గా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా తన బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లారు. ఆ స్టోన్ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే హడావుడి చేశారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ మెయిన్ ఆఫీసుకు ఈ తనిఖీల గురించి సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక రెడీ చేశారు.జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని మిగతా అధికారులను ఏసీబీకి తెలిపారు. ఎఫ్ఐఆర్ లో కూడా విడదల రజనీ ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనపడుతుంది. పోసాని బెయిల్ పై బయటకు రావడంతో తర్వాత ఇక జైలుకు వెళ్లేది విడదల రజనీ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనపడుతున్నాయి.
భయపడను…లొంగను
తనపై నమోదయిన కేసులపై మాజీ మంత్రి విడదల రజనీ స్పందించారు. తనపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదిగితే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. తనపై నమోదయిన కేసులన్నీ అక్రమ కేసులేనని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసులు నమోదు చేశారని విడదల రజని అన్నారు. అక్రమ కేసులకు తాను భయపడనని, న్యాయపోరాటం చేస్తానని విడదల రజనీ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై కేసులు నమోదు చేశారంటూ విడదల రజనీ ధ్వజమెత్తారు. కేసులకు భయపడి తాను రాజకీయంగా లొంగిపోనని తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటూ పోరాటం సాగిస్తానని విడదల రజనీ స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని విడదల రజనీ అన్నారు.