ఆర్యవైశ్యులకు అండగా వుంటా: పైళ్ల శేఖర్ రెడ్డి

- Advertisement -

భువనగిరి నియోజకవర్గం: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ల  శేఖర్ రెడ్డి అన్నారు. పేద ఆర్యవైశ్యుల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు ఖాళీ స్థలం ఇప్పిస్తానని హమీనిచ్చారు. స్థానిక సుమంగళీ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయన పాల్గోన్నారు. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని, అన్నారు భువనగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు.  నిరుపేదలందరికీ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయడం జరిగిందని తెలిపారు భువనగిరి పట్టణంలో, నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. గ్యాంగ్ స్టర్  నయీమ్ ఆక్రమించుకున్న భూములన్నీ తిరిగి భూ యజమానులకు అప్పగించే వరకు కృషి చేస్తానని అన్నారు.  నయీమ్ కేసు సిట్ దర్యాప్తు విచారణలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తెలియజేశారు ఆర్యవైశ్యులందరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్ స్వాతి మహేష్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular