ఎల్బీనగర్, వాయిస్ టుడే:
విశ్వబ్రాహ్మణ కులస్తులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్ కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ లో శుభం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సింహ గర్జన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మధుయాష్కి గౌడ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను, బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకలేదా అని ప్రశ్నించారు. ఆయన రెచ్చగొట్టే మాటల వల్ల బంగారం వంటి శ్రీకాంతాచారి తొలి బలిదానం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల ఆశలు అడియాశలు అయ్యాయని అన్నారు. బీసీ వ్యతిరేక బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబిసి నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, కులస్తులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు