Wednesday, March 18, 2026

తెలంగాణ జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు?

- Advertisement -

తెలంగాణ జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు?

Will there be rain in Telangana districts for another two days?

హైదరాబాద్:ఆగస్టు 26

తెలంగాణలో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడం తో పలు ప్రాంతాల్లోని వాగులు పొంగిపొర్లాయి. గోదావరి, కృష్ణా నదుల్లోకి వరదనీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతినడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే, గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటు న్నారు. ఈ క్రమంలోనే మరో రెండురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వాయువ్య బంగాళా ఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిం ది. రుతుపవన ద్రోణి కూడా కొనసాగు తోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారా ల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్