ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
గుడ్ మార్నింగ్ కోరుట్ల కార్యక్రమంలో పర్యటించిన ఎమ్మెల్యే సంజయ్
కోరుట్ల
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆన్నారు..
గుడ్ మార్నింగ్ కోరుట్ల కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 30 వ వార్డు లో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పర్యటించారు..
ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.. ఈ సందర్భంగా
డ్రైనేజీ, సి.సి రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు… కోరుట్ల నియోజకవర్గం లోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గుడ్ మార్నింగ్ కోరుట్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు…
నియోజకవర్గం లోని వివిధ వార్డు నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన సమస్యలు విని ప్రజాసమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు..వారి వెంట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్,చైర్ పర్సన్ అన్నం లావణ్య -ఆనిల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం ఆనిల్,కౌన్సిలర్ సజ్జు,నాయకులు అతీఖ్ ,మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు..


