వస్తావా.. నీ రేటెంత..?
హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ !
మహిళ భద్రతపై సీపీ ఫీల్డ్ టెస్ట్
హైదరాబాద్, మే 6 : వాయిస్ టుడే
“Will you come? What’s your rate?” — Female IPS Officer Harassed by Miscreants in Hyderabad!
హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటలు దాటితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బస్టాండ్ ల వద్ద, మెట్రో స్టేషన్ల వద్ద ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు, గద్దల్లా వాలిపోతారు. బైక్స్ పై అమ్మాయి సమీపంలో రౌండ్లు కొడుతూ, కొద్దిసేపు గమనించి, వెంటనే దగ్గరకు వచ్చేస్తారు. వస్తావా మాతో, నీ రేటెంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించి వేధింపులకు పాల్పడుతుంటారు. నెమ్మదిగా బేరాలు మొదలెడతారు. ఇలా నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల వద్ద ఇదే తంతు. తాజాగా ఇలాంటి ఆకతాయిలపై దృష్టిపెట్టి, వార్తల్లో నిలిచారు లేడీ సింగం, మల్కాజ్ గిరి నూతన పోలీస్ కమిషనర్ సుమతిమల్కాజిగిరి సీపీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే, టార్గెట్ ఆకతాయిలు అంటూ రంగంలోకి దిగారు. అర్దరాత్రి 12 గంటలకు దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్ వద్దకు సివిల్ డ్రస్ చేరుకున్న పోలీస్ కమిషనర్ సమతి. రోడ్డుప్రక్కన సాధారణ మహిళలా నిల్చున్నారు. అటుగా వెళుతున్న ఆగతాయిలు, ఆమెను గమనించడం మొదలు పెట్టారు. అలా కొద్దిసేపటికే ఒక్కొక్కరుగా ఆమె చుట్టూ చేరుకున్నారు. హలో వస్తావా.. నీ రేటెంత .. అంటూ అడగటం మొదలుపెట్టారు.అలా అర్దరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3.30 గంటల వరకూ సుమారు మూడున్నర గంటలపాటు లేడీ ఐపీఎస్‌ను కొందరు పోకిరీలు తమ మాటలతో వేధించారు. రోడ్డుపై నడుకుంటూ వెళుతున్న ఆమెను బైక్ లతో అడ్డుపడుతూ, ఈ రాత్రికి వస్తావా.. అంటూ బేరాలు మొదలెట్టారు. అలా ఆకతాయిల వేధింపులు భరిస్తూ , అక్కడున్న పరిస్దితులను స్వయంగా గమనిస్తూ రోడ్డుపక్కన గంటలపాటు నిల్చుని రాత్రివేళల్లో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా పరిశీలించారు మల్కాజిగిరి సీపీ సుమతి. మూడున్నర గంటలుగా అటువైపు ఏ ఒక్క పోలీసు కానిస్టేబుల్ రాలేదు. కనీసం పెట్రోలింగ్ వాహనం సైతం అటువైపు రాకపోవడంతో ఆకతాయిలు ఇంకా రెచ్చిపోయారు. బైక్ లపై చక్కర్లు కొడుతూ, ఒంటరి మహిళను వేధించడం ఆపలేదు. తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ అటుగా వచ్చి, కమిషనర్ వద్ద నిల్చున్నారు. మరికొద్దిసేపటికే ఓ ఎస్సై వచ్చి మఫ్టీలో ఉన్న ఐపీఎస్ అధికారి సుమతికి సెల్యూట్ కొట్టారు. పోలీస్ ఆ మహిళకు సెల్ల్యూట్ కొట్టడంతో అక్కడున్న ఆకతాయిలకు ఓక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.ఆమె ఒంటరి మహిళకాదు. వాళ్లు అనుకున్నట్లు సాధారణ మహిళ అంతకన్నాకాదు. ఆమె సివిల్ డ్రస్ లో ఉన్న ఐపీఎస్ అధికారిణి మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ అని తెలుసుకున్న పోకిరీలకు గుండె ఆగినంత పనైంది. ఇంకేముంది క్షణాల్లో పెట్రోలింగ్ వెహికల్ స్పాట్ కు రావడం, ఆమెను వేధించిన 40మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడం చకచకా జరిగిపోయాయి. మరో పోలీసు వాహనంలో స్టేషన్ కు చేరుకున్న ఐపీఎస్ సుమతి , పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి రోడ్లపై ఒంటరి అమ్మాయిలను టార్గెట్ చేస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా పోలీసులకు చిక్కిన 40 మందిలో విద్యార్దులు, ఉద్యోగులతో పాటు గంజాయి సేవించిన బ్యాచ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా సాహోసోపేతమైన ఆపరేషన్లు చేయడం సుమతికి ఇప్పుడేం కొత్తకాదు. సరిగ్గా 25ఏళ్ల కిందట 2001లో డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా మఫ్టీలో వెళ్లినిల్చుని, వేధించడానికి వచ్చిన ఆకతాయిల భరతం పట్టారు. వివాదంగా మారుతున్న ఐపీఎస్ ఆపరేషన్..ఇలా తెలుగు రాష్ట్రాల్లో లేడీ సింగం, ఐపీఎస్ అధికారిణి సుమతి ధైర్య సహసాలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి.. హ్యాట్సాఫ్ మేడం అంటూ పొగడ్తలతో కామెంట్స్ , పోస్టులు పెడుతూ మల్కాజ్ గిరి కమిషనర్ చర్యలను మెచ్చుకున్నారు.



