Tuesday, February 17, 2026

ప్రశ్నించే గొంతుకను గెలిపించండి

- Advertisement -

ప్రశ్నించే గొంతుకను గెలిపించండి
కరీంనగర్, నవంబర్ 12
ప్రశ్నించే గొంతుకను నేను.. కాపాడుకుంటారా? పిసికేస్తారా? అంటూ బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించి.. శ్రీ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ దీప కాంతుల వెలుగులు మీకు అష్టైశ్వర్యాలు, సిరి‌ సంపదలు, సుఖ సంతోషాలను అందించాలని అన్నారు. మీ జీవితం ఆనందమయం అవ్వాలని మనసారా కోరుకుంటూ హిందూ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ప్రశ్నించే గొంతుకను నేనని.. అంతిమ నిర్ణయం మీదే అని తెలిపారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ పై యుద్దం చేస్తున్నా అన్నారు. అణిచివేసేందుకు నాపై 74 కేసులు పెట్టిన భయపడలేదని అన్నారు. బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. బండి సంజయ్ ను గెలిపించాలంటూ భారీ ఎత్తున యువకుల ర్యాలీ నిర్వహించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్