- Advertisement -
సిద్దిపేట: శుక్రవారం నాడు గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గోన్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎన్నికల్లో అధర్మ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ధర్మం గెలిచింది, నేను గెలిచా. ఆనాడే గజ్వేల్ లో కేసీఆర్ మీద పోటీ చేస్తా అని చెప్పాను. కెసిఆర్ ను గెలిపించిన పాపానికి పేదల బతుకులు మట్టి కొట్టి వాళ్ళ భూములను లాక్కున్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి మీకు మాయమాటలు చెబుతారు మోసపోకండి. వాళ్లు ఏమిచ్చినా తీసుకోండి ఓటు మాత్రం ధర్మానికి వేయండి. నిండు మనసుతో గజ్వేల్ ప్రజలు నన్ను గెలిపించాలని అన్నారు.
- Advertisement -