దేశ ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు :మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

- Advertisement -

దేశ ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

హనుమకొండ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Wishes to all the people of the country on the 80th Indian Independence Day: Minister Ponguleti Srinivasa Reddy.

హనుమకొండ, ఆగస్టు 15: ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితమే భారత స్వాతంత్య్రం అని పేర్కొంటూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎనలేని త్యాగాలు చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన త్యాగమూర్తులకు ఘన నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, వారు కలలు కన్న సమాజాన్ని నిర్మించడమే వారికి అందించే నిజమైన నివాళి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

80వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఎల్‌ నాగరాజు, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత రెండున్నరేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను వివరించారు.

ప్రభుత్వం అంటే కొందరి చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతో పనిచేయడమే ప్రజా పాలన అని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో యువత, మహిళలు, రైతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఒకవైపు హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు పేదలకు సంక్షేమ పాలన అందించేలా ద్విముఖ వ్యూహంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి చెందిన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్య్ర సమరయోధులకు ఘన సత్కారం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. వారి సేవలను స్మరించుకుని గౌరవం తెలిపారు.

వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను వీక్షించి అభినందించారు. కర్తవ్య నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి బ్యాడ్జీలు, వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, తెలంగాణతో పాటు దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular