గూడూరు పట్టణం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని కళాశాల డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు తెలిపారు . భారతదేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 కార్యక్రమాన్ని చేపట్టింది . ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిరవధికంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 నిర్వహించారు .

V/O : గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 కార్యక్రమం ద్వారా విద్యార్థుల నుండి 35 ఉపాయాలను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు . తద్వారా దేశ మరియు రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు . విద్యార్థులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు వారి ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు .




