కేసీఆర్‌తోనే తెలంగాణాకు దేశ చిత్రపటంలో అగ్రస్థానం
– తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటాండ్లు
– కేసీఆర్ కన్న కలలను సాకారం చేయాల్సింది మనమే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
– మంథనిలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
With KCR, Telangana is at the top of the country's image
మంథని
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేసి బారత దేశ చిత్రపటంలో అగ్రస్థానంలో నిలిపిన గొప్ప నాయకులు కేసీఆర్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా మంథని పట్టణంలోని ముక్తి ఆశ్రమ ఆవరణలో మొక్కలునాటిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, అలాంటి స్వరాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించారని అన్నారు. ఈనాడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటానికి కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అయితే బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దాలనే కేసీఆర్ కలలు మధ్యలోనే ఆగిపోయాయని, ఈ క్రమంలో ప్రజలు సైతం శోక సముద్రంలో మునిగిపోయారని ఆయన వాపోయారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అలాంటి మహ నాయకుడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, ఆయన స్థాపించిన పార్టీలో పనిచేయడం అదృష్టంగా బావించాలన్నారు. అలాగే కేసీఆర్ కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందని, మళ్లీ కేసీఆర్ పాలన వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన వచ్చే వరకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మంథని నియోజకవర్గ ప్రజలపక్షాన కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, ఆరేపల్లి కుమార్, మాచిడి రాజు గౌడ్, గుబ్బూరు వంశీ, వేల్పుల గట్టయ్య, ఆకుల రాజబాబు, వేల్పుల పోచం, బడికేల శ్రీనివాస్, జంజర్ల శేఖర్, కొండా రవీందర్, కరివేన శ్రీనివాస్ యాదవ్, పుప్పాల తిరుపతి, ఇర్ఫాన్, బందారి శ్రీకాంత్, జావేద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.