స్వామివారి ఆశీర్వాదంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..
కాంగ్రెస్ హయంలో రైతులకు కష్టాలు
మేడ్చల్
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శామీర్ పేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో 46వేల చెరువులు సస్యశ్యామలంగా ఉండేవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కరువుకాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు, సాగునీరు లేక ప్రజలు, రైతులు పంటలు ఎండి పోయి ఆందోళన చెందుతున్నారు.
స్వామివారి ఆశీర్వాదంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..మాజీ మంత్రి మల్లారెడ్డి
- Advertisement -
- Advertisement -