
మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, వాయిస్ టుడే: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గానికి మరో మూడు కొత్త చెక్ డ్యాం లు మంజూరు అయ్యాయి. అందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. భీంగల్ మండలం సాలింపురం వద్ద 6.35 కోట్ల వ్యయం,కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ వద్ద 4.10 కోట్ల వ్యయం, కమ్మర్పల్లి మండల రాళ్లవాగుపై కొనాపుర్ వద్ద 3.97 కోట్ల నిధులతో మూడు చెక్ డ్యాం లకు ప్రభుత్వం నూతనంగా మంజూరి ఇచ్చింది. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని అడగ్గా కొత్తగా మూడు చెక్ డ్యాం లు మంజూరి చేశారని మంత్రి వేముల తెలిపారు. నియోజకవర్గ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కప్పల వాగు,పెద్ద వాగు మీద చెక్ డ్యాంలు నిర్మించుకున్నమని మంత్రి అన్నారు. దీంతో వాగులకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని,బోర్లలో నీరు సమృద్దిగా ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. అట్లాగే సాలింపూరం,కొనాపూర్ వద్ద మరో మూడు చెక్ డ్యాంలు రైతుల కోరిక మేరకు కావాలని అడగ్గానే మంజూరి ఇచ్చిన రైతు బాందవుడు కేసిఆర్ కు బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.