- Advertisement -
షాపింగ్ మాల్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి
కూకట్పల్లి వై జంక్షన్లోని చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ పై నుండి దూకి రమణమ్మ(50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు షాపింగ్ మాల్ లో నాలుగు సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది.
సోమవారం ఈ రోజు 2వ ఫ్లోర్ లో పని చేయాల్సి ఉండగా, షాపింగ్ మాల్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -