- Advertisement -
ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు మృతి
Women Maoists killed in retaliatory fire
ఛత్తీస్ ఘడ్
భద్రత బలగాలు నక్సల్స్ కు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళల నక్సల్స్ మృతి చెందింది. నారాయణపూర్ _కాంకేరు జిల్లాల సరిహద్దులో గల అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందింది. మృతులు నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ, పీఎల్జీఏ కంపెనీ 5 నెం సభ్యులగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్, 315 బోర్ గన్ తో సహ భారీ మొత్తంలో ఆయుధాలు, నక్సల్స్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలోని హచెకోటి, చింద్ పూర్, బినాగుండా, అద్నార్ కక్నార్ చుట్టుపక్కల పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యులు 30,40ఉన్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. డీఆర్జీ, బీఎస్ఎఫ్ ఎస్టీ ఎఫ్ సంయుక్తంగా నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో పాల్గొన్నారని తెలిపారు
బస్తర్ డివిజన్ పరిధిలో వర్షాకాలంలో జరుగుతున్న యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 26 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, 212 మందిని అరెస్టు చేశామని, 201 మంది నక్సలైట్లు లొంగిపోయారని బస్తర్ రేంజ్ ఐజి పి సుందరరాజ్ తెలిపారు
- Advertisement -