మహిళాసంఘం ఆర్పీలను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలింపు..

- Advertisement -

మహిళాసంఘం ఆర్పీలను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలింపు..

Women's association blocked the RPs and moved to the police station.

 జమ్మికుంట
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ పరిధిలో గల మహిళా సంఘం మున్సిపల్ ఆర్పి లను శుక్రవారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన జమ్మికుంట పోలీసులు, వివరాల్లోకి వెళితే శుక్రవారం రోజున ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత, ఆదేశాల మేరకు శుక్రవారం రోజున హైదరాబాదులోని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు, మహిళా సంఘాల ఆర్ పి లు సభ్యులు 30 మందితో కలిసి ముట్టడికి బయలుదేరు సమయంలో జమ్మికుంట పోలీసులు వీరిని అడ్డుకొని శాంతి భద్రతల దృష్ట్యా  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ మహిళా సంఘాల ఆర్పీలను  అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆర్పీలు, ఎండి ఆబేధాబాను, మాట్లాడుతూ గత కొద్ది కాలంగా చాలీచాలని 6000 రూపాయల జీతంతో ఉదయం 8 గంటలకు మొదలుకొని రాత్రి 8 గంటల వరకు కష్టపడుతున్నామని మా కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని గత ఏడు నెలలుగా మాకు జీతాలు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్టి విషయాన్ని గ్రహించి మాకు 20,000 జీతంతో పాటు ఉద్యోగ భద్రతపై ఇన్సూరెన్స్, డ్రెస్ కోడ్ ఐడి కార్డులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు, లేని క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ఆర్పీలమంతా ఏకమై నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఆర్పీలు
టీ .దేవేంద్ర, పి రజిత, కే రజిత, అభేదాభాను,  కే విజయలక్ష్మి, కే లత, ఎండి అర్షియా అంజుమ్, కే శారద, పి ఉమాదేవిలతో 30 మంది మహిళా ఆర్పీలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular