Wednesday, December 4, 2024

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం

ఆర్పీ, గ్రామ వివోఏ లకు రూ.10 వేల వేతనానికి  కృషి

పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల
మహిళా సంక్షేమం ప్రభుత్వాల  బాధ్యత అని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో మెప్మా పరిధిలో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్ ల సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ
జీవన్ రెడ్డి
హాజరయ్యారు. ఈ సందర్బంగా రిసోర్స్ పర్సన్ ల సంఘం పక్షాన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఆర్పీలు వినతి పత్రం సమర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ మహిళ సాధికారత, బలోపేతం తోనే కుటుంబం, సమాజం బాగుపడుతుందన్నారు. 2004 లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించి అమలు చేశారన్నారు. 2009-14 మధ్య కాలంలో పావలా వడ్డీ స్థానంలో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలు అయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వడ్డీ రాయితీ అమలు చేయకపోగా, అమలు ప్రయత్నం సైతం పెండింగ్ లో ఉండడం దురదృష్టకరం అన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్. పీ లకు గత ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదలయ్యేలా చూడడం తో పాటు, ఏప్రిల్ తర్వాత రిసోర్స్ పర్సన్ లకు రూ.10 వేల గౌరవ వేతనం అందేలా చూస్తమని, ఇదే తరహాలో గ్రామ స్థాయిలో పనిచేసే వివోఏ లకు సైతం పదివేల వేతనం అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. 2014 కు పూర్వం పీఎఫ్ కలిగిన వారికే బీడీ పెన్షన్ వచ్చిందని, తర్వాత క్రమంలో ప్రకటనలు తప్ప 2018తరవాత కొత్తగా ఒక్క బీడీ పెన్షన్ మంజూరు కాలేదన్నారు. కానీ మన ప్రభుత్వం లో వచ్చే బడ్జెట్ నుండి బీడీ పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు అందరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అలాగే లబ్ది అందని గృహిణి కి సైతం లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో రు.2,500 అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో సిలిండర్ ధర రూ.4,00 లకు ఇస్తే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే సిలిండర్ ధరను రూ.1,200 లకు పెంచిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ ల్లో భాగంగా మార్చి నుండి రూ.5,00 లకే సిలిండర్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అట్లాగే 2,00 యూనిట్ల లోబడి విద్యుత్ రాయితీ కింద ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఆలోచన విధానమే మహిళా సంక్షేమమని, అందుకే మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం, మహిళా సంఘలా ద్వారా మహిళలోకానికి వారధిగా ఉన్న రిసోర్స్ పర్సన్ లు, గ్రామ స్థాయిలో వివోఏ ల పాత్ర కీలకం అని, వారి సేవలకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ వేతనాలు విడుదల చేయించడం తో పాటు ఏప్రిల్ తర్వాత జీవో ప్రకారం వచ్చే రూ. 6,000 సంఘాల ద్వారా వచ్చే రూ. 2,000లను కలుపుకొని ప్రభుత్వం మరో రెండు వేలు కలిపి మొత్తంగా రూ.10 వేల గౌరవ వేతనం
ఆర్పీ ,వివోఏ లకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు సమస్యల పరిష్కారం, అవసరమైన సహకారం అందిస్తామన్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్న మెప్మా బిల్డింగ్ ను తిరిగి మెప్మా కే అప్పగించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి- దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత తో పాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్