Monday, March 16, 2026

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో వెండి, కాంస్య  పతకాలు సాధించిన

- Advertisement -

ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు

కోరుట్ల: కరీంనగర్  అంబెడ్కర్ స్టేడియంలో అల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ (సిఎస్కేఐ) 2023 వారి ఆధ్వర్యంలో ఈ నెల 17,18,19 తేదీల్లో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటిల్లో కటాస్, కుమ్మితే విభాగాల్లో కోరుట్ల పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు ఇందూరి హర్షిత్ (2వ తరగతి) వెండి, కాంస్య పతకాలు, కుందారపు భన్సీధర్ (5వ తరగతి) కాంస్య  పతకాలను జాతీయ స్థాయిలో అందుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండంట్ తుమ్మనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు వారి మానసిక ఉల్లాసానికి, ఆత్మరక్షణకు కరాటే విద్య దోహదపడతాయని తెలిపారు.ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను, కోచ్ అల్లె రమేష్ లను సన్మానించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ సిరికొండ గంగాధర్, తుమ్మనపల్లి మనోజ్ కుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్