Monday, May 11, 2026

నిబద్దతతో పనిచేసి శాంతి భద్రతలను పరిరక్షించాలి

- Advertisement -

నిబద్దతతో పనిచేసి శాంతి భద్రతలను పరిరక్షించాలి

Work diligently and maintain peace and security

నంద్యాల జిల్లా పోలీసులతో డీజీపీ సమీక్ష
నంద్యాల
నంద్యాల జిల్లా పోలీసు అధికారులతోరాష్ట్ర డీజీపీ  ద్వారకా తిరుమల రావు సమీక్ష నిర్వహించారు.  నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుల పనితీరును అభినందించారు.
డీజీపీ  మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని,నేరాల నియంత్రణలో పోలీసు అదికారులు వారి సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కూడా నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రస్తుతం నేరాలు అదుపులో ఉన్నాయన్నారు.ముఖ్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సైబర్ నేరాలు,ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.నిబద్ధతగా పనిచేసి జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు.క్రైమ్ డిటెక్షన్ లో సిసి ఫుటేజ్ ఆధారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయని, వీటి కోసం రాష్ట్రంలో 18 వేల సిసి కేమరాలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా లక్ష కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్  డీఐజీ  కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా, ఇతర పోలీసు అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్