సీనియర్ సీటీజన్ల సంక్షేమం కోసం కృషి
జిల్లా సంక్షేమ అధికారిణి వాణిశ్రీ
జగిత్యాల
సీనియర్ సీటీజన్ల సంక్షేమం,వారి సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ అన్నారు.గురువారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారిణిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి. వాణిశ్రీని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ ప్రతినిధులు కలిసి స్వాగతిస్తూ పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ నిరాదరణకు,వేధింపులకు గురవుతున్న సీనియర్ సిటీజేన్స్ టోల్ ఫ్రీ నెంబర్.14567 కు ఫిర్యాదు చేయాలన్నారు.తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి డివిజన్ల లో సీనియర్ సిటీజేన్స్ కు చేస్తున్న సేవలను అభినందించారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్దులను విస్మరిస్తే వారు శిక్షార్హులేనన్నారు. జిల్లా కలెక్టర్ షేఖ్ యాస్మిన్ భాష ఆధ్వర్యంలో జగిత్యాల, ,కోరుట్ల ,మెట్ పల్లి ఆర్డీవోలు సీనియర్ సిటీజేన్స్ కేసుల ను సత్వరం పరిష్కరిస్తున్నందు కు కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంక్షేమ అధికారిణి వాణిశ్రీ కి తమ అసోసియేషన్ అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సీటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, సీనియర్ సీటీజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పి.సి.హన్మంత్ రెడ్డి,,ఎం.డి.యాకూబ్,కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావు,జగిత్యాల పట్టణ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పి.సతీశ్ రాజ్, ,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.