హైదరాబాద్: తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టు పురోగతిపై జల సౌదా లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా సమీక్ష చేసారు. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగం, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టు లపై లోతుగా సమీక్ష జరిపారు.
మంత్రి మాట్లాడుతూ నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం. మనం పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబు దారి తనంతో పని
చేయాలి. తెలంగాణ లో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాలి. నీటి పారుదల పనులలో మూడో పార్టీ చెక్ ఉండాలి. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న
అపోహలు తొలగిపోయేలా పని చేయాలని అన్నారు.
తరువాత అయన జల సౌద లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తాం. నీటివాటా విషయమై కేంద్రంతో చర్చిస్తాం. పెండింగ్ ఉన్న ప్రాజెక్టు లను పూర్తి చేస్తాం. 40వేల చెరువుల
నిర్వహణ గురించి మా ప్రభుత్వం శ్రద్ద వస్తుంది. ఆరోపణలపై విచారణ చేస్తాం. ప్రజల డబ్బుతో జరిగే పన్నుల్లో గోప్యత ఉండదు. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించా. నీటిపారుదల శాఖది కీలక పాత్ర.
ఎవ్వరు డిసైన్ చేసిన ఎవ్వరు నిర్మాణం చేసిన బాధ్యలను చెయ్యాల్సి ఉంటుంది. కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించా. కోట్లాది ప్రజలు విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం …అంతా
పారదర్శకంగా ఉంటుంది. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ఎంత అవసరమైన ఖర్చు చేసేందుకు
ముఖ్యమంత్రి తో చర్చించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.



