- Advertisement -
కొత్తగూడెంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
World Fishermen's Day is celebrated in Kothagudem
ఖమ్మం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు కోరారు.. ఈరోజు గురువారం ఖమ్మం జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల వెంకట నరసయ్య ముదిరాజు గత పది సంవత్సరాలుగా ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి మత్స్యకారుల జీవితాలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన సంఘం తెలంగాణ ముదిరాజ్ మహాసభ అని కొనియాడారు. ముదిరాజ్ మహాసభ సాధించినవి కొన్నే అయినా సాధించుకోవలసినవి ఎంతో ఉందన్నారు. ముదిరాజుల కులవృత్తి అయినటువంటి మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్న ముదిరాజుల భవిష్యత్ తరాలపై ఆలోచన చేస్తూ ఇప్పుడు ఎదుగుతున్న యువతరాన్ని విద్య వైపు ఉన్నతమైన చదువుల వైపు దృష్టి పెట్టాలన్నారు. ఉన్నతమైన చదువులు చదువుతూ విద్యావంతులుగా సంపూర్ణత సాధించిన నాడే మన జీవితాలను రాజకీయంగా ఆర్థికంగా బలపరుచుకోగలమని ఎవరో వచ్చి మన జీవితాలను బాగు చేస్తారని ఆలోచన మానుకోవాలని ఇప్పుడు జరుగుతున్న కులగననలో జిల్లాలో ఉన్న ముదిరాజులందరూ ముతరాసి బంటు తెలుగు తెనుగోళ్లు గా పిలవబడుతున్న మనం ముదిరాజ్ అని కచ్చితంగా రాయించాలని మన సంఖ్యా బలాన్ని కాపాడాలని రాబోయే స్థానిక ఎలక్షన్లలో అవకాశం ఉన్న ప్రతి చోట సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఆయా ప్రాంతాల రాజకీయ పార్టీ ఏదైనా మన వాళ్ళని పోటీ చేయించి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె రాంబాబు ముదిరాజ్ కార్యదర్శి నార్ల శేషయ్య ముదిరాజ్, గౌరవ సలహాదారులు పగడాల మల్లేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు లింగనబోయిన లక్ష్మణ్ ముదిరాజ్, ఖమ్మం జిల్లా మత్స్య సొసైటీ డైరెక్టర్ తిప్పట్ల నరసింహారావు ముదిరాజ్, జిల్లా నాయకులు దొండ దర్గయ్య ముదిరాజ్, జిల్లా యూత్ నాయకులు తవడబోయిన కృష్ణా ముదిరాజ్, వెంగంపల్లి సురేష్ ముదిరాజ్, బోనకల్లు మండల కార్యదర్శి రెడ్డబోయిన ఉర్దండు ముదిరాజ్, కొత్తగూడెం మత్స్యశాఖ అధ్యక్షులు ముద్రబోయిన అప్పారావు ముదిరాజ్, కార్యదర్శి పోతురాజు వెంకటేశ్వర్లు ముదిరాజ్, ఉపాధ్యక్షులు పగడాల శ్రీనివాస్ ముదిరాజ్, చాగంటి శ్రీనివాస్ ముదిరాజ్, సభ్యులు బుడిగ ఉపేంద్ర ముదిరాజ్, కొత్తగూడెం ముదిరాజ్ అధ్యక్షులు బుడిగ వెంకన్న ముదిరాజ్, కార్యదర్శి రావుల సంజీవరావు ముదిరాజ్, గొడుగు వెంకటేశ్వర్లు ముదిరాజ్, గొడుగు రామ ముదిరాజ్, పర్వత వెంకటేశ్వర్లు ముదిరాజ్ తదితర ముదిరాజు పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -