గంభీరావుపేట సెప్టెంబర్ (వాయిస్ టుడే ప్రతినిధి) : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం రోజు సెలెక్టెడ్ మెంబర్స్ (ఎస్ ఎం) పండితులు హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళలతో పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలు సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా సంతోషముతో క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. పెద్దలు చిన్నారులు మహిళలు అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు పది హెను వదల మంది నుండి రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరిచినట్లు ఎస్ ఎం నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కోటయ్యగారి సంతోష్ రెడ్డి ,గడ్డంబాలు, చెల్లాపురం దేవయ్య ,గణేష్, అక్కపల్లి నాగరాజు రాజు పేనింగారి ,దండు శ్రీకాంత్, దండు శ్రీకాంత్ బొందుగుల సాయి తేజ పాటి రాజు తదితరులు పాల్గొన్నారు.



