Friday, October 18, 2024

నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్

- Advertisement -

విజయవాడ, అక్టోబరు 9: వైసీపీ తప్ప దేశంలో ఏ పార్టీ  కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. మేనిఫెస్టోలో ఇచ్చినహామీలను 99శాతం అమలు చేశామన్నారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం చేశామన్నారు. మార్చి , ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామన్నారు సీఎం జగన్,  మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు చేశామన్నారు. అధికారాన్నిఇచ్చిన ప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నట్లు వెల్లడించారు. అక్టోబరు 25 నుంచి డిసెంబరు 5వరకు ఎమ్మెల్యేల బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లో మూడు సమావేశాలు జరుగుతాయన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో 40 రోజుల పాటు బస్సు యాత్రలు సాగుతాయన్నారు.  ప్రతి బస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. సామాజిక వర్గాలన్నింటిని కలుపుకొని వెళ్లేదే బస్సు యాత్ర అని అన్నారు. రాబోయేది కురుక్షేత్ర సంగ్రామమేనని, పేదవాడికి, పెత్తదారులకు జరుగుతోందన్నారు. 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేలు వివరిస్తారని అన్నారు. పేదలంతా ఏకమైతేనే పెత్తందారులను ఎదుర్కొంటామన్నారు. డిసెంబరు 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం మొదలవుతుందన్నారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహిస్తుంది. దీని ద్వారా గ్రామస్థాయిలో నైపుణ్యమున్న క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యమన్నారు.జగనన్న సురక్షకార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చాు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఏ వ్యాధులు ఉంటే అన్ని విధాలా సాయం చేస్తామన్నారు.  వ్యాధి నయం అయ్యేంత వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత మంచి చేయడానికి జగన్ మళ్లీ రావాలన్నారు. కోటి 60 లక్షల ఇళ్లకు వై ఏపీ నీడ్స్ జగన్ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మళ్లీ మన ప్రభుత్వమే రావాలన్నారు. ఏపీకి జగనే ఎందుకు కావాలో చేప్పేందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఉంటుందన్నారు. అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న సీఎం జగన్,  22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని గుర్తు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న జగన్, పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అక్క చెల్లెమ్మల సాధికారతకు కృషి చేశామన్న సీఎం, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామన్నారు. స్థానిక సంస్థల నుంచి కేబినెట్‌ వరకూ సామాజిక న్యాయం చేశామన్న ఆయన, వైఎస్‌ జగన్‌ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నామని స్పష్టం చేశారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామన్న జగన్, రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించామన్నారు.

25 నుంచి బస్సు యాత్ర

సెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఇక అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. సోమవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌­చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు కష్టపడాలని అన్నారు.వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలను మరింత విస్తృత్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యచరణను ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన పార్టీ దేశంలోనే లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని సీఎం అన్నారు. పేదల గురించి ఆలోచించిన పార్టీ వైసీపీ మాత్రమేనని, పేదలకు అండగా నిలిచామని అన్నారు. పేదలను ప్రభుత్వం అదుకుందని అన్నారు.అలాగే మహిళా సాధికారతకు కృషి చేశామని, మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు మేలు జరగాలని, నవంబర్‌ 10 వరకు జగనన్న ఆరోగ్య సురక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏ కుటుంబం కూడా అనారోగ్యం బారిన పడకూడదని, పేదవాళ్లను కాపాడుకోవాలన్నదే ఆరోగ్య సురక్ష లక్ష్యమన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షతో కోటీ 60 లక్షల ఇళ్లను కవర్‌ చేస్తున్నామని, 5 దశల్లో జగనన్న ఆరోగ్య సురక్షఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 15వేల హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని, రోగి పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31వరకు బస్సుయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.  ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని అన్నారు. మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని, బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారని, రోజు మూడు చొప్పున సమావేశాలు జరుగుతాయన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్