హైదరాబాద్, డిసెంబర్ 13, (వాయిస్ టుడే): ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తీశారు దర్శకుడు మహి వి. రాఘవ్! ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా… ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో పాటు సీఎం కావడానికి ముందు ఆయనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ‘యాత్ర 2’ తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర 2′ సినిమాలో మరోసారి వైఎస్ఆర్ పాత్రలో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి సందడి చేయనున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన జీవా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.యాత్ర 2’ ట్రైలర్ రెడీ అయ్యింది. డిసెంబర్ 21న… వచ్చే గురువారం పుట్టినరోజు కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఏపీ సీఎం అభిమానులకు ఆ రోజు మరింత స్పెషల్ కానుందన్నమాట! త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక ‘యాత్ర 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.e: ‘యాత్ర’ చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ‘యాత్ర 2’ను కూడా ఆ తేదీకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ‘యాత్ర 2’ విడుదల కానుంది. ఇటీవల సినిమాలో వైఎస్ భారతి పాత్రలో నటిస్తున్న కేతికా నారాయణన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మది, సంగీతం : సంతోష్ నారాయణన్.యాత్ర 2’లో సమకాలీన రాజకీయ ప్రముఖుల ప్రస్తావన సైతం ఉండబోతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ఉత్తరాది నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు. వైయస్సార్ మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పేరు బలంగా వినిపించింది. ఆమె పాత్రను ఎలా చూపిస్తున్నారు? అనేది సినిమా విడుదలైతే తప్ప చెప్పలేం! జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ఫస్ట్ లుక్ చూస్తే… అచ్చం సోనియా గాంధీలా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. హిందీ నటుడు, ఈ ఏడాది మరణించిన అఖిల్ మిశ్రా భార్య సుజానే. సుమారు 20 ఏళ్ళ నుంచి భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్, సీరియళ్లు చేస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా ‘యాత్ర 2’.
జగన్ పుట్టిన రోజున యాత్ర 2
Published By Voice Today Team
148
- Advertisement -
- Advertisement -
- Tags
- #8praja sankalpa yatra completes 2 years
- director mahi v raghav about yatra 2
- director mahi v raghav about yatra 2 update
- jagan birthday song
- praja sankalpa yatra
- yatra
- yatra 2
- yatra 2 latest updates
- yatra 2 motion poster
- yatra 2 movie
- yatra 2 movie release date
- yatra 2 movie teaser
- yatra 2 official teaser
- yatra 2 story about ap cm jagan
- yatra 2 teaser
- yatra movie
- yatra telugu movie
- ys jagan birthday celebrations
- ys jagan yatra 2 movie



