బీసీ కులగణన పేరిట భారీ మోసానికి తెరలేపిన వైసీపీ

- Advertisement -

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

అమరావతి నవంబర్ 23:  బీసీ కులగణన పేరిట వైసీపీ భారీ మోసానికి తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బ్లాక్‌మెయిల్ చేసి బీసీలకు అందే లబ్ది తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు. ప్రైవేటు సంస్థలకు బీసీల సమాచారమిచ్చి తమ బతుకులు తాకట్టు పెడుతున్నారన్నారు. మోసపూరిత రాజకీయాలతో ఎన్నికల్లో లబ్ది పొందాలని చేసే ప్రయత్నమే సామాజిక బస్సు యాత్రలు అని పేర్కొన్నారు. బీసీలను బానిసలుగా జగన్మోహన్ రెడ్డి దిగజార్చారన్నారు. వైసీపీ బీసీల పోరాట కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular