వైసీపీ అలసత్వం… రాష్ట్రంలో కరువు పరిస్థితులు

- Advertisement -

కరవు నష్ట పరిహారం అంచనా వెయ్యడంలో వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్ లో మాట్లాడుతూ ఊళ్లకు ఊళ్లు వలస వెళ్లిపోతున్నాయన్నారు. కరువు విషయంలో ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రెండో పంట వేసుకునేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడ లో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్​కి వ్యవసాయం పట్ల అవగాహన లేదన్న ఉమా. తక్షణమే 444 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజన హామీలపై కేంద్రం పైన ఒత్తిడి తేవడంలో జగన్ విఫలం చెందారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యడంలో వైసీపీ విఫలమైందన్నారు.

440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ కరవు తీవ్రత తగ్గించి ముఖ్యమంత్రి చెబుతున్నారని దుయ్యబట్టారు. నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయన్నారు. విభజన చట్టంలో చెప్పిన ప్రాజెక్టులు కేంద్రం రాష్ట్రానికి మంజూరు చెయ్యడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించడంలో జగన్ విఫలమయ్యారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular