Wednesday, February 19, 2025

ఒక్కోక్కొ వివాదంలో ఇరుక్కుంటున్న వైసీపీ నేతలు

- Advertisement -

ఒక్కోక్కొ వివాదంలో ఇరుక్కుంటున్న వైసీపీ నేతలు

YCP leaders who are stuck in controversy

కాకినాడ, జనవరి 30, (వాయిస్ టుడే)
అయిదేళ్ల పాలనతో అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీలో ముఖ్య నాయకులందరూ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు. వైసీపీ మౌత్ పీస్‌లా పనిచేసి టీడీపీ, జనసేన అధినేతలతో పాటు, ఆ పార్టీల ఇష్టానుసారం నోరుపారేసుకున్న వారంతా.. ఇప్పుడు ఒకొక్క వివాదంలో ఇరుక్కుంటూ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే అలాంటి వారికి సొంత పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదంట. ఎవరిపై వచ్చిన ఆరోపణలకు వారే సమాధానాలు ఇస్తున్నారు తప్ప పార్టీలో ఇతర నేతలు మాత్రం వారికి సపోర్ట్‌గా మాట్లాడటం లేదట. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక కేడర్ గందరగోళంలో పడుతోందంట. అసలు వైసీపీ పెద్దల మౌనం వెనుక.ప్రభుత్వం మారినప్పటి నుంచి పలువురు వైసీపీ ముఖ్య నేతలు రకరకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తూ.. కేసుల చట్రంలో ఇరుక్కుంటున్నారు. పార్టీలో కీ లీడర్ విజయసాయిరెడ్డి దగ్గరి నుంచి రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా వంటి ముఖ్య నేతలు వివిధ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. జగన్‌కు సలహాదారుడిగా వ్యవహరించిన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌లు కూడా అరెస్టుల భయంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ఆయా నేతలపై ఆరోపణలు వచ్చిన సమయంలో ఎవరికీ వారే బయటకు వచ్చి అసలేం జరిగిందనే దానిపై వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది.అంతే తప్ప ఎక్కడా కూడా ఒకరికి మద్దతుగా మరొకరు మాట్లాడిన సందర్భాలు కనపడటం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు మాత్రమే వివరణలు ఇచ్చుకుంటున్నారు. మామూలుగా ఏ పార్టీలో అయినా అధికారం ఉన్నా లేకపోయినా ఆరోపణలు ఎదుర్కునే నాయకులకు మద్దతుగా పలువురు నేతలు బయటకు వచ్చి మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో కూడావిమర్శలను తిప్పికొట్టడానికి నాయకులంతా మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవారు. కానీ ఓటమి తర్వాత వైసీపీలో అలాంటి సిట్యువేషన్ లేకపోవటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గోడౌన్‌లో వేల బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయి. దానిపై ప్రభుత్వం కేసు పెట్టింది. పౌరసరఫరాల అధికారుల ఫిర్యాదు మేరకు గోడౌన్ యజమాని జయసుధపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకు కూడా నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లటం.. వారు లేకపోవటంతో నోటీసులు ఇంటికి అంటించి వెళ్ళటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.అప్పట్లో నాలుగు రోజులు ఎవరికి అందుబాటులో లేని పేర్ని నాని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో సడెన్ ఎంట్రీ ఇచ్చారు. జరిగిన పరిణామాలపై మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలంటే తన సతీమణిని విడిచిపెట్టి, తనను అరెస్టు చేసుకోవచ్చన్నారు. తనను కట్టుకున్న నేరానికి నా భార్య వ్యక్తిత్వ హననానికి గురవుతుందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. టెక్నికల్‌గా తమ బాధ్యత లేకున్నా.. నైతికంగా బాధ్యత వహిస్తూ అధికారులు చెప్పినట్లుగా జరిమానా చెల్లించామన్నారు. తమ కుటుంబం ఎటువంటి తప్పు చేయలేదని తన తల్లి మీద ఒట్టేసి చెబుతున్నానన్నారుతమపై కక్ష కట్టి తన భార్య, గోడౌన్‌ ఇన్‌చార్జి మీద కేసు నమోదు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. అధికారులు అడిగినట్లు జరిమానా కట్టాక కూడా క్రిమినల్ కేసులు పెట్టడం సివిల్ సప్లైస్ చరిత్రలోనే లేదన్నారు. పేర్ని నాని వరుస పరిణాలమాలపై మీడియా సమావేశం అనంతరం కూటమి నేతలు ఆయనకు గట్టిగానే కౌంటర్ లు ఇవ్వటం స్టార్ట్ చేశారట. మంత్రులు నాదెండ్ల మనోహర్ తో పాటు కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతలు ప్రభాకర్ రెడ్డి, బుద్దా వెంకన్న తదితరులు పేర్ని నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలోనే తమను టార్గెట్ చేసి కేసులు పెట్టించినప్పుడు ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్నినాని కేనా పెళ్లాం పిల్లలు.. తమకు లేరా అని కూటమి నేతలు ఫైర్ అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్నినానికి ఆడవాళ్లు గుర్తుకురాలేదా అంటూ సెటైర్లు వేశారు. కూటమి నేతలు ఒకరి తర్వాత మరొకరు వరుసగా టార్గెట్ చేస్తుండటంతో పేర్ని నాని సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. అయితే కూటమి నేతలు వరుసబెట్టి నానిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా వైసీపీ నుంచి ఇతర నేతలు ఎవరూ ఈ విషయంలో రియాక్ట్ కాలేదు.. వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టిన బుగ్గన, శ్రీకాంత్ రెడ్డి కానీ చిత్తూరులో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి కానీ.. ఇతర సీనియర్లు కూడా వారు మాట్లాడాలనుకున్న విషయాలను మాట్లాడారే తప్ప నాని అంశాన్ని ప్రస్తావించలేదు.గతంలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక‌ృష్ణారెడ్డి వంటి నేతలు ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో కూడా.. ఎవరిపై వచ్చిన ఆరోపణలకు వారే సమాధానాలు చెప్పారే తప్ప ఇతర వైసీపీ నేతలెవ్వరూ వారికి సపోర్ట్‌గా బయటకు రాలేదు.. ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న తమ నేతలకు సొంత పార్టీ వారే అండగా నిలబడకపోవడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదంట. దాని గురించి ప్రస్తావిస్తే వైసీపీ అధిష్టానం మాత్రం అవసరమైన సమయంలో అందరూ కచ్చితంగా స్పందిస్తారని చెబుతోందట.పార్టీ లీడర్ల నుంచి క్యాడర్ వరకు ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా వారికి పార్టీ అండగా ఉంటుందని జగన్ బయటకు వచ్చినప్పుడల్లా చెప్పి వెళ్తున్నారు. పార్టీలో ప్రతీ ఒక్కరూ ముఖ్యమేనని అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి పోతున్నారు .. ఆయన మాట్లాడం కాదుకదా పార్టీలో ఒకరికి మద్దతుగా మరొకరు స్పందించడం మానేశారు. దాంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల విషయంలో అసలు పార్టీ లైన్ ఏంటనేది స్పష్టత రాకపోవడం పార్టీ వర్గాలను అయోమయానికి గురిచేస్తోందట. పార్టీలోని కీలక నేతలకే దిక్కులేక పోతే ఇక తమను పట్టించుకునేదెవరని? వైసీపీ శ్రేణులు బెంబేలెత్తి పోతున్నాయంట.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్