Thursday, October 24, 2024

10న వైసీపీ మ్యానిఫెస్టో

- Advertisement -

10న వైసీపీ మ్యానిఫెస్టో
విజయవాడ, మార్చి 4
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా… వైసీపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే ‘సిద్ధం’ పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న వైసీపీ….మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటించనున్నారు. మేదరమెట్ల సిద్ధం సభ ఏర్పాట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మేదరమెట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభలో సీఎం జగన్ వివరిస్తారన్నారు. ఈ సభకు గత మూడు సభలు కంటే పెద్ద సంఖ్యలో సుమారు 15 లక్షల మంది హాజరవుతారన్నారు. మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో మార్చి 10 తర్వాత సీఎం జగన్ నియోజకవర్గాల పర్యటన ఉంటుందన్నారు. 25 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుందన్నారు. సిద్ధం సభలతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని విజయసాయి రెడ్డి అన్నారు.వైసీపీ గత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసిది. చాలా సింపుల్ గా ప్రజలకు సులభంగా చేరేలా ఉండే వైసీపీ మేనిఫెస్టో కూడా గత ఎన్నికల్లో విజయానికి ఒక కారణమని విశ్లేషకులు అంటారు. ఇదే తరహాలో ఈసారి కూడా వైసీపీ మేనిఫెస్టో ఉండనుందని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మార్గాలకు ఈసారి మేనిఫెస్టోలో ప్రాథాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఊతం అందించే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టో రూపొందించామని గతంతో వైసీపీ తెలిపారు. ఈసారి కూడా అదే తరహాలో మెరుగైన మేనిఫెస్టో రూపొందించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేసింది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు కూడా కసరత్తు చేస్తుంది. దీంతో టీడీపీ-జనసేన కూటమికి ధీటైన మేనిఫెస్టోను రూపొందించాలని సీఎం వైసీపీ భావిస్తుంఈ సభకు 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్లుగా తెలిపారు.మనం మ్యానిఫెస్టోలో పొందుపరచబోయే అంశాల గురించి కూడా సీఎం జగన్ సిద్ధం సభలో తెలియజేస్తారు. మేనిఫెస్టో తయారవుతోది. సరైన సమయంలో రిలీజ్ చేస్తారు. ఆఖరి సిద్ధం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. 100 ఎకరాల స్థలంలో సభ ఉంటుంది. అవసరం నాలుగోవది, చివరిది మేదరమెట్లలో జరగబోతోంది. చివరి సభను వైసీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి వైసీపీ కేడర్ ను సమకూర్తి దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో సభ ఏర్పాటు చేస్తున్నారు. 15 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. సభకు వచ్చే కేడర్ కు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను సభా వేదికగా సీఎం జగన్ ప్రజలకు వివరించబోతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్