మ్యానిఫెస్టోకు అంతా సిద్ధం చేసినవైసీపీ
విజయవాడ, ఏప్రిల్ 26
ఏపీలో సీఎం జగన్ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. అయితే జగన్ ఇప్పటికే మేమంతా సిద్దం అంటూ దాదాపు 21 రోజుల పాటు దాదాపు 60కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముగించారు. మరో జైత్రయాత్రకు సిద్దమవుతున్న తరుణంలో మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 27, శనివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో కలిసి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాటిపై సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించి తుదిమెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఇలా సమావేశం అనంతరం రూపుదిద్దుకున్న హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ది లక్ష్యాలను మేనిఫెస్టోగా తయారు చేసి ప్రజలకు తెలియజేయనున్నారు. గతంలో కంటే మెరుగైన విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం.2019-2024 మధ్య పొందిన లబ్ధిని మరింత పెంచేలా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో లాగానే మహిళలకు, యువతకు, రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి గతంలో కంటే మరింత ఎక్కువ మేలు జరిగేలా రూపొందించనున్నట్లు సమాచారం. బడుగు బలహీన వర్గాలకు మరింత సంక్షేమం అందించడమే లక్ష్యంలా కనిపిస్తోంది. అయితే మొన్నటి ప్రచారంలో కూడా తాను అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో ఉంచనని స్పష్టం చేశారు సీఎం జగన్. తమ పరిధికిలోపడి చేయదగినవి, ప్రజా ప్రయోజనం కలిగే వాటిని మాత్రమే మేనిఫెస్టోలో ఉంచనున్నట్లు తెలిపారు. జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనే నినాదాన్ని కూడా గతంలో జరిగిన బహిరంగ సభల్లో చెప్పారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంధంలా భావిస్తున్నట్లు కూడా వివరించారు. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలను గురించి ప్రజా గళం సభలో వివరించారు. అయితే వైసీపీ మేనిఫెస్టో ఇందుకు భిన్నంగా ఉంటుందా.. లేక గతంలో లాగానే ఉంటుందా అన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.
మ్యానిఫెస్టోకు అంతా సిద్ధం చేసినవైసీపీ
- Advertisement -
- Advertisement -