ప్రజాశాంతి పార్టీ అధ్యక్షు లు కే.ఏ.పాల్
ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా వైద్యు లు పరిక్షలు జరిపి నా ఆరోగ్యం బానే వుందన్నారనీ కానీ త్రీటౌన్ సిఐ 20 మంది పోలీసులతో వచ్చి దీక్ష భ గ్నం చేసి కాలు విరగిట్టారనీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షు లు కే.ఏ.పాల్ అన్నారు.ప్రజాస్వామ్యవాదులు ఈ దాడి ని ఖండించాలనీ, జగన్ కాల్ చేసి ధీక్షను భగ్నం చేయిం చారనే అనుమానాలున్నాయనీ తనపై దాడికి పాల్పడ్డ సిఐ, ఎస్ఐని సస్పెండ్ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. లేదా అంటే 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా వుంటా యనీ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తా ననీ, పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగ లననీ అన్నారు. ఏపి ఎంపీ లు రాజీనమాలు చేయా లనీ అలాచేస్తే 30 రోజు ల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపిస్తాననీ అన్నా రు. ప్రజాశాంతి పార్టీ తరపున పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తున్నానని, నాతో కలిసి పోటీ చేయు పవన్ , ప్యాకేజీలపై ఆశపడొద్దని సూచిం చారు.