వైసీపీ మౌనం – వ్యూహమా? వైఫల్యమా
విజయవాడ, ఫిబ్రవరి 11, (వాయిస్ టుడే )
YCP’s silence – strategy? Failure?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పా అనుసరిస్తున్న మౌనం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న దాఖలాలు కనిపించకపోవడంతో, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినట్లే.. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ సూచనలు రాగానే అభ్యర్థుల ఎంపిక, కమిటీల నియామకంపై పార్టీలు కసరత్తు చేస్తాయి. కానీ వైసీపీలో ప్రస్తుతం అటువంటి సందడి ఎక్కడా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత క్యాడర్‌ను తిరిగి సమీకరించడంలో నాయకత్వం కొంత తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కూటమి దూకుడుగా ఉండటం, పోలీసులు , అధికార యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని గతంలోనే పార్టీ ప్రకటించినందున , పోటీకి దూరంగా ఉండటమే మేలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికలను బహిష్కరిస్తే పరువు దక్కుతుందనేది ఒక వాదన అయితే, అది పార్టీ మనుగడకే ముప్పు అనే సంకేతాలు క్షేత్రస్థాయి నుంచి అందుతున్నాయి. స్థానిక ఎన్నికలు అంటే కేవలం పార్టీ గెలుపోటములే కాదు, గ్రామాల్లో నాయకులు తమ ఉనికిని కాపాడుకునే అవకాశం. ఒకవేళ పార్టీ పోటీ చేయకపోతే, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా అనాథలయ్యే ప్రమాదం ఉంది. పోటీలో లేకపోతే క్యాడర్ నిరుత్సాహపడి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార కూటమి వైపు లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉంది.రాజకీయాల్లో మైదానం వదిలి వెళ్లడం ఎప్పుడూ సరైన సంకేతం కాదు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న తరుణంలో, స్థానిక ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతుంది. ఎన్నికల్లో ఓడినా పోరాడామనే ముద్ర ఉంటే భవిష్యత్తుపై ఆశ ఉంటుంది, కానీ పోటీనే చేయకపోతే పార్టీ బలహీనపడిందనే ముద్ర శాశ్వతంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇది పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించడమే కాకుండా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని దెబ్బతీస్తుందన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. వైసీపీ నాయకత్వం ఈ ప్రచారాన్ని ఖండించి, కేడర్‌లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం ద్వారానే కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. పరీక్షల లోపే ఎన్నికలు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా, పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. లేనిప క్షంలో, ఈ స్థానిక ఎన్నికలు వైసీపీ ఉనికికి పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు బాయ్ కాట్
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చి 17తో, గ్రామ పంచాయతీల గడువు ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేశాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ సంకేతాలు రాగానే పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక, కమిటీల నియామకంతో సందడి నెలకొంటుంది. కానీ, వైసీపీ క్యాంపులో కనిపిస్తున్న నిశ్శబ్దం పలు అనుమానాలకు తావిస్తోందిగతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికల విషయంలోనూ పార్టీ నాయకత్వం అదే ఆలోచనలో ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు, అధికార యంత్రాంగం అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వరని వైసీపీ ఆరోపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇంకా కోలుకోలేదు. ఆర్థికంగా, సామాజికంగా దాడులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎన్నికల బరిలోకి దిగడం సాహసమేనని కొందరు భావిస్తున్నారు. ఓడిపోతే వచ్చే పరాభవం కంటే, వ్యవస్థలపై నిరసనగా పోటీకి దూరంగా ఉన్నామని చెప్పడం ద్వారా పార్టీ పరువు కాపాడుకోవచ్చనేది కొందరి వాదన.రాజకీయాల్లో ‘మైదానం వదిలి వెళ్లడం’ అంటే ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వడమే. స్థానిక ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కావు, అవి పార్టీ గ్రామస్థాయి ఉనికిని చాటుకునే అవకాశం కల్పిస్తాయి. పార్టీ పోటీ చేయకపోతే దశాబ్దాలుగా జెండా మోసిన కార్యకర్తలు రాజకీయంగా అనాథలవుతారు. తమ ఉనికి కోసం వారు అధికార కూటమి వైపు లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూసే ప్రమాదం ఉంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో, ఎన్నికల నుంచి తప్పుకుంటే పార్టీ పూర్తిగా బలహీనపడిందనే ముద్ర పడుతుంది. ఇది పార్టీ నుంచి భారీ వలసలకు దారితీసే అవకాశం ఉంది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పోరాటం చేయకుండా తప్పుకోవడం వల్ల వైసీపీకి దీర్ఘకాలికంగా నష్టమే జరుగుతుంది. ఓడినా పోరాడామనే ముద్ర ఉంటేనే క్యాడర్‌లో భవిష్యత్తుపై ఆశ చిగురిస్తుంది. వైసీపీ నాయకత్వం అధికార పార్టీ అక్రమాలను ఎండగడుతూనే, ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలబడాలి.మార్చిలో జరగబోయే ఈ స్థానిక ఎన్నికలు వైసీపీకి ఒక “లిట్మస్ టెస్ట్” లాంటివి. ఈ పరీక్షలో పోటీ చేసి ఉనికిని చాటుకుంటుందో లేక బహిష్కరణ పేరుతో వెనకడుగు వేస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా, ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.


