- Advertisement -
నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి
Yesterday State Minister...Today Union Minister
బాబు క్లాస్
విజయవాడ, నవంబర్ 8, (వాయిస్ టుడే)
మొన్న రాష్ట్రమంత్రి సుభాష్‌కు క్లాస్ తీసుకున్న చంద్రబాబు నేడు రామ్మోహన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై సీరియస్. వేరే కార్యక్రమాలు ఉంటే వర్చువల్‌గానైనా రావాలని హితవు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇవాళ సబ్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేందమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరుకాలేదు. ఏం జరిగిందని ఆరా తీసిన చంద్రబాబు… ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు డుమ్మాకొట్టడం మంచిది కాదని సూచించారు. సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎక్కడ ఉన్నారని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విజయవాడలో వేరే కార్యక్రమం ఉందని అక్కడకు వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేశారు. నేరుగా ప్రజలతో సంబంధం ఉండే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు డమ్మా కొట్టడమేంటని ప్రశ్నించారు. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు డుమ్మా కొట్టద్దని సూచించారు. వీలు కాకుంటే వర్చువల్‌గానైనా హాజరైతే మంచిదని హితవు పలికారు. ఈ మధ్య కాలంలో పాలనలో జరుగుతున్న లోటుపాట్లు సరిచేస్తూనే పార్టీ వ్యవహారాలపై కూడా చంద్రబాబు ఫోకస్డ్‌గా ఉంటున్నారు. ఎక్కడ ఎవరు ఏం పని చేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే మొన్నీ మధ్య మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్ తీసుకున్నారు. నమ్మి పదవులు ఇస్తే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఏంటని ప్రశ్నించారు. సభ్యత్వ నమోదు, పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్ల నమోదు ప్రక్రియపై రివ్యూ చేపట్టిన సీఎం చంద్రబాబు… మంత్రి సుభాష్ నియోజకవర్గంలో తక్కువ అవ్వడంపై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది.
- Advertisement -