Sunday, September 8, 2024

దిగుబడి పెరిగె..  ధర తగ్గే.. టమోట

- Advertisement -

5 రూపాయిలకు చేరుకున్న టమోట

మైసూర్, ఆగస్గు 28:  కామన్‌ మ్యాన్‌కు గుడ్‌న్యూస్‌! రైతన్నకు బ్యాడ్‌ న్యూస్‌! మరికొన్ని రోజుల్లోనే టమాట ధరలుదారుణంగా పడిపోనున్నాయి. కిలో టమాట ఐదు రూపాయాలకే దొరుకుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే మధ్యతరగతి వర్గాలకు మాత్రం ఊరట కలుగుతుంది.రెండు నెలల క్రితం టమాట ధరలు సంచలనం సృష్టించాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని అంటాయి. కిలో టమాట రూ.300 వరకు పలికింది. కొందరు రైతులైతే లక్షల్లో ఆర్జించారు.

yield-increased-price-decreased-tomato
yield-increased-price-decreased-tomato

అయితే సాధారణ మధ్యతరగతి పౌరుడు మాత్రం ఇబ్బంది పడ్డాడు. వంద రూపాయలు పెట్టినా ఐదు టమాటలకు మించి రాకపోవడంతో ఆందోళన చెందాడు. దాంతో పాటే పచ్చి మిర్చీ ఇతర కూరగాయలు పెరగడంతో జేబుకు చిల్లు పడింది. ఇంటి బడ్జెట్‌ పెరిగి పోయింది.వేసవిలో విపరీతంగా ఎండలు కొట్టడంతో టమాట దిగుబడి తగ్గిపోయింది. అదే సమయంలో కొన్ని చోట్ల అతి వృష్టితో టమాట పంట నాశనమైంది. మరికొన్ని చోట్ల వర్షాలు లేక తోటలు ఎండిపోయాయి. ఉత్తరాదిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వారం రోజుల్లోనే టమాట రూ.30 నుంచి 300కు చేరుకుంది. ధరల్లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేపాల్‌ నుంచి టమాటను దిగుమతి చేసుకుంది. దక్షిణాది నుంచి దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా మార్కెట్లకు టమాటాలు తరలించింది.సాధారణంగా టమాట పంట మూడు నెలల్లో చేతికొస్తుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లకు అధిక స్థాయిలో టమాట వస్తోంది. దాంతో హోల్‌సేల్‌ ధరలు పడిపోతున్నాయి. మైసూర్‌లోని ఏపీఎంసీ మార్కెట్లో ఆదివారం కిలో టమాట రూ.14కు దిగొచ్చింది. శనివారం నాటి రూ.20 నుంచి ఆరు రూపాయలు తగ్గింది. ఇదే సమయంలో బెంగళూరులో కిలో టమాట రూ.30-35 వరకు పలుకుతోందిఈశాన్య రాష్ట్రాల్లో టమాట డిమాండ్‌ తగ్గిపోయింది. అలాగే ఉత్తరాదిలోనూ తక్కువ టమాట వాడుతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మిగులు టమాట స్థానిక మార్కెట్లకు వస్తోంది. సరఫరా ఇలాగే ఉంటే మరికొన్ని రోజుల్లోనే కిలో ఐదు రూపాయలకు తగ్గిపోతుందని మైసూర్‌ ఏపీఎంసీ సెక్రెటరీ ఎంఆర్‌ కుమారస్వామి అంటున్నారు. ప్రతి రోజూ నిలకడగా 40 క్వింటాళ్ల టమాట వస్తోందని తెలిపారు.ఒకవైపు టమాట ధర తగ్గిందని సామాన్యులు సంతోషిస్తుంటే రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల్లో స్థిరత్వం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కిలో టమాట పండించడనికి 10-12 రూపాయలు ఖర్చవుతుందని కర్ణాటక రాజ్య రైతు సంఘ జనరల్‌ సెక్రెటరీ ఇమ్మావు రఘు అన్నారు.ప్యాకేజింగ్‌, రవాణాకు మరో మూడు రూపాయలు అవుతుంది. మొత్తం కిలో టమాటాకు సగటు రూ.14 ఖర్చవుతుంది. అంతకన్నా తక్కువకే మార్కెట్లో ధర పలికితే కష్టమని ఆయన తెలిపారు. ‘రైతులకు కిలో టమాటకు 14 రూపాయలే వస్తే భారీగా నష్టపోవాల్సిందే. అందుకే టమాట సేకరణ, ప్యాకేజింగ్‌, నిల్వ, అమ్మకాల ప్రక్రియకు సరికొత్త అప్రోచ్‌ అవసరం’ అని ఆయన అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్