Sunday, September 8, 2024

ములుగులో  నువ్వా నేనా?

- Advertisement -

బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ
హోరెత్తిస్తున్న ఇరు పార్టీల ప్రచారం

ములుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ములుగు నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా నెలకొంది.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న బడే నాగజ్యోతి ప్రచారంలో దూసుకుపోతుండగా అంతే దీటుగా కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారంలో దూకుడు పెంచింది. నియోజకవర్గంలోని ఓటర్లకు పార్టీలకి సంబంధించిన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ప్రత్యర్థి పార్టీ పై విమర్శలు చేస్తూ ఇరువురు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ కి ఓటు వేస్తే అనార్థలే: బడే నాగజ్యోతి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి అనూహ్యంగా టికెట్టు దక్కించుకున్న బడే నాగజ్యోతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. గెలుపే లక్ష్యంగా బడే నాగజ్యోతి తన ప్రధాన ప్రత్యర్థైన కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కను ఓడించేందుకు ప్రచారంలో కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ కి ఓటు వేస్తే అనర్ధాలు తప్పవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయడం సాధ్యం కాదని, కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని, రాష్ట్రంలో మరల బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కావున తనని గెలిపిస్తే ములుగు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారంలో  వివరిస్తూ ముందుకు సాగుతోంది.

బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అప్పుల ఊబిలోనే తెలంగాణ: ఎమ్మెల్యే సీతక్క

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకురాలిగా చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతూ బీఆర్ఎస్ అభ్యర్థికి దీటుగా ప్రచారంలో పాల్గొంటుంది. ములుగు క్షేత్రంలో ఉంటూ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకు వెళ్తోంది. ప్రచారంలో ప్రధానంగా సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిన అంశాల పైన ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నిస్తూ అదే స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టబోయే ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరవేస్తానంటూ హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతానికి బీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు.ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ములుగు నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేయగా, మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఏదిఏమైనా ములుగు నియోజకవర్గంలో పెద్దగా వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా ప్రచారం సాఫీగా సాగుతూ ఉండడంతో అధికారులు, నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్