నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లొచ్చు  

- Advertisement -

తిరుమలలో బోనులో చిక్కిన నాలుగో చిరుత

You can walk calmly on the walkway
You can walk calmly on the walkway

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. ఏడో నంబర్ మైలు వద్ద ఆదివారం 7 గంటల ప్రాంతంలో చిరుత చిక్కినట్లు తితిదే అధికారులు వెల్లడించారు. కాగా ఈ చిరుతతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు నాలుగు చిరుతలను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో  మరో చిరుత చిక్కింది.  నిన్న రాత్రి 7వ మైలురాయి వద్ద బోనులో పడింది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు.  ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది.  ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular