Saturday, April 11, 2026

విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా..?

- Advertisement -

విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా..?

You have interest on Statues but not on students..?

మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు.
ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకో వడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని ఒక ప్రకటనలో అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?అని ఆయన ప్రశ్నించారు. పది రోజులు కాకముందే వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆస్పత్రి పాలైన దుస్థితి ఉందని తెలిపారు.

సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పోవడం దుర్మార్గమని విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాటలు నీటి మూటలయ్యాయని తెలిపారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలనీ, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని అడిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్