- Advertisement -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
యాదాద్రి
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ లో చోటు చేసుకుంది. అర్బన్ కాలనీ చెందిన బోనగాని స్వాతి (21) సోమవారం సాయంత్రం
అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తల్లి బాల లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రోజువారీ పనులు ముగించుకుని ఇంటికి రాగానే తన కూతురు మృతి చెంది ఉందని బోరున విలపించింది. తన
కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తమ కూతురు మృతిపై అనుమానం ఉన్నట్లు తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు
చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
- Advertisement -