యువత మద్యం మానండి…

- Advertisement -

యువత మద్యం మానండి…
ప్రాణాలను రక్షించుకోండి..

కమాన్ పూర్
యువత మద్యం మాని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలని సాంస్కృతిక కళామండలి వారు పాటల రూపంలో వివరించారు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం సభ్యులచె పరిసరాల పరిశుభ్రత డ్రగ్స్ గంజాయి మాదకద్రవ్యాలు , ఆడపిల్లలని పుట్టనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్ధం బేటి బచావో బేటి పడావో అని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.మరియు ప్రభుత్వ పథకాల పైన అవగాహన కల్పించడం జరిగింది యువత పెడుతూవ పట్టకుండా మంచి మార్గంలో నడవాలని నేటి యువత 30 సంవత్సరాలు నిండకుండానే యాక్సిడెంట్లలో అనారోగ్యాలతో చాలామంది యువత మరణాలపాలవుతున్నారు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారని నేటి యువత రేపటి దేశ భవిత అని యువతరం గ్రహించాలని తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని పాటల రూపంలో అవగాహన కల్పించడం జరిగింది అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో అమలవుతున్న రెండు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డి పి ఆర్ ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాకారులు జనగామ రాజనర్సు ఈదునూరి పద్మ కోండ్ర వెంకన్న గౌడ్ ఇల్లందుల మల్లేష్ గౌడ్ జిన్నరమ సలేంద్ర రాజన్న  దీకొండ శ్రావణ్ కన్నూరి రేణుక కట్కూరి శ్రీవల్లి  గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular