- Advertisement -
హైదరాబాద్ డిసెంబర్ 1: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి కి కండిషన్ బెయిల్ ముగిసింది. కండిషన్ బెయిల్ ముగియడంతో సీబీఐ కోర్టు లో భాస్కర్‌రెడ్డి లొంగిపోయారు. ఇప్పటికే భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఐ కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 30 వరకు కండిషన్ బెయిల్ మీద భాస్కర్‌రెడ్డి బయట ఉన్నారు. కండిషన్ బెయిల్ ముగియడంతో చంచల్ గూడా జైల్లో భాస్కర్‌రెడ్డి లొంగిపోయారు. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
- Advertisement -