పులివెందుల శాసనసభ్యుడిగా శాసన సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సభలో ఉండకుండా ఛాంబర్ కు పయనమైన జగన్..!
అమరావతి,
వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో అదుగు పెట్టారు.
పులివెందుల శాసనసభ్యుడిగా శాసన సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -