ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైయస్సార్

- Advertisement -

ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైయస్సార్

YSR Introduced Arogyashri and stayed in the hearts of the people

గూడూరు
దివంగత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గ 15వ వర్ధంతి సందర్భంగా గూడూరు నగర పంచాయతీ వైఎస్ఆర్ కూడలి నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన  గూడూరు నగర పంచాయతీ  చైర్మన్ జూలుపాల వెంకటేశ్వర్లు , వైస్ చైర్మన్ పి ఎన్. అస్లాం .ఈ సందర్భంగా ఛైర్మెన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఒక సువర్ణ యుగమని , పేదల కొరకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు.అనంతరం వైస్ ఛైర్మెన్ పి ఎన్ అస్లాం మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడని, జలయజ్ఞం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే ధ్యేయంగా ఆయన పరిపాలన సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్  లక్ష్మన్న , కౌన్సిలర్లు ఖలీల్ ,కిషోర్ కుమార్ ,నందకిషోర్ ,కో ఆప్షన్ సభ్యులు  మదర్ సావళి ,పట్టణ కన్వీనర్ ఆబేలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు పత్తి రంగడు ,సత్యాలు ,హబీబ్ బోజుగు ప్రభాకర్ ,దండు శీను, బోజుగు సుంకప్ప, మనోహర్ ,పాముల రంగన్న ,శీలన్న ,పాముల శివకుమార్, సమీర్ ,మధుసూదన్ రావు, రంగస్వామి, పైగేరి మాధవరావు  ,తుఫాన్ బండల భాష మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular