- Advertisement -
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది: మాజీ మంత్రి డొక్కా
అమరావతి జూన్ 5
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే పలువురు ప్రముఖులను ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల ఫోన్లతో వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి నేతలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -