Thursday, February 5, 2026

హిందూ ద్రోహి వైసిపి: నాగబాబు

- Advertisement -

హిందువు అనేది ఒక నమ్మకం, మతం కాదని ధర్మం, జీవన విధానం
               హిందూ ద్రోహి వైసిపి: నాగబాబు
హైదరాబాద్ ఫిబ్రవరి 4

YSRCP is a Hindu traitor: Nagababu
హిందువు అనేది ఒక నమ్మకం, మతం కాదని ధర్మం, జీవన విధామని జనసేన ఎంఎల్‌సి నాగబాబు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువేనని, తన మత ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతర మతాలను కించపరచకుండా ఉన్నానని తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఎంఎల్ సి నాగబాబు వీడియోను విడుదల చేశారు. 2020 సెప్టెంబర్ 6న అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైమన రోజు అని, ఎపి వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న రోజు అని, ప్రతిపక్షాల ఒత్తిడి తలొగ్గి ఈ కేసును సిబిఐకి అప్పజెప్పుతున్నామని వైసిపి ప్రభుత్వం చెప్పిందని, కానీ ఈ కేసు విషయంలో ఓ హిందూ కార్యకర్త కోర్టు ఆశ్రయించగా సిబిఐ విచారణ చేయలేదని తేలిందన్నారు. ఈ కేసు విషయంలో వైసిపి ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందని దుయ్యబట్టారు. డిసెంబర్ 2020లో రామతీర్థంలోని రాముడు విగ్రహ శిరస్సును నరికిన కూడా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని నాగబాబు మండిపడ్డారు.2020 జనవరి 22 రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయోధ్యకు వెళ్లి దర్శనం చేసుకున్నారన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభం సందర్భంగా వైసిపి అధినేత, నాయకులు ఒక ట్వీట్, శుభకాంక్షలు తెలిపారా? అని ప్రశ్నించారు. హిందు మతాన్ని ఆచరించే, వ్యతిరేకించే దమ్ము వైసిపి నేతలకు లేదని, హిందువుల మీద కుళ్లు కుతంత్రాలు తప్ప ఏమీ లేవని విమర్శించారు. తిరుమల భక్తులకు భగవంతుడిని వైసిపి దూరం చేసిందన్నారు. తిరుమలలో గెస్ట్ హౌస్‌ల్లో చార్జీలు 500 నుంచి 1000 రూపాయలకు ఎలా పెంచుతారని నిలదీశారు. టిటిడి కామన్ గుడ్ ఫండ్ రూ.2.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు ఎవరిని సంతోష పెట్టడానికి పెంచారని నాగబాబు అడిగారు. తిరుమలలో నాయకులే రూల్స్ పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారని అని దుయ్యబట్టారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి దేవుడిని దర్శనం చేసుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా దర్శనం చేసుకుంటారని చురకలంటించారు. వైసిపి మంత్రులు ఇష్టారీతిన మాట్లాడితేనే అసెంబ్లీలో ఉన్న 151 సీట్లలో, మధ్యలో ఐదు తీసేసి 11 సీట్లు ప్రజలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తిరుమలలో డిక్లరేషన్ అడిగారని జగన్ పర్యటన రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. మతానికి, సెక్యులర్‌కు తేడా తెలియని నేతలకు భోదించడం తన వల్ల కాదన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్