కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ఖాయం

- Advertisement -

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ఖాయం
షర్మిల
హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి చెక్ పెట్టారు.వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు.లోటస్ పాండ్లో ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టత నిచ్చారు అధినేత్రి. ఈనెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం ఖాయమని షర్మిల స్పష్టం చేశారు. రేపు సాయంత్రం కల్లా అందరూ ఢిల్లీ చేరుకోవాలని నేతలకు అధినేత్రి చెప్పారు. ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం. షర్మిల ప్రకటనతో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular