అఖిల భారతీయ యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Yuvajana Congress 64th Foundation Day Celebrations
కోరుట్ల,
పట్టణంలో అఖిల భారతీయ యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటి చైర్మెన్ శివసేన రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ రావు ఆదేశాల మేరకు జువ్వాడి కృష్ణా రావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులందరూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో
కోరుట్ల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, మ్యాకల నర్సయ్య, నజ్జు ,దండవేని వెంకట్, ఆడెపు మధు, చెదలు సత్యనారాయణ, శ్రీరాముల అమరేందర్, సదుల వెంకట స్వామి, ఓలెపు రాజేష్, పసుల కృష్ణప్రసాద్, నాగునూరి గంగాధర్ ,చింత శ్రీనివాస్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రిజ్వాన్ ,కోరుట్ల ఉపాధ్యక్షుడు సైదు గంగాధర్, నాయకులు అజయ్ హరీష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.