మంథనిలో ఘనంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధు జన్మదిన వేడుకలు
మంథని
పెద్దపల్లి
జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలను అభిమానులు గురువారం తన నివాసమైన రాజగృహలో ఘనంగా నిర్వహించారు.మంథని ఎమ్మెల్యేగా పుట్ట పుట్ట మధుకర్ విజయం సాధించిన మే 16వ తేదీనే తన జన్మదినంగా జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ శైలజ దంపతులను అభిమానులు గజమాలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. జడ్పీ చైర్మన్ కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అరేపల్లి కుమార్, కాయితి సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు యెగోళపు శంకర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మాచిడి రాజు గౌడ్, నాయకులు తగరం శంకర్ లాల్, బత్తుల సత్యనారాయణ, కనవేనా శ్రీనివాస్ యాదవ్, ఆసిఫ్ ఖాన్, ఇర్ఫాన్, తాటి సతీష్, పుప్పాల భాగ్యలక్ష్మి ,పద్మ , ఆడిచర్ల సమ్మయ్య తోపాటు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.