చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించాలి
Ponds and ponds should be demarcated
కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి
కోరుట్ల,
పట్టణంలోని చెరువులు, కుంటలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాలు మేరకు హద్దులు నిర్ణయించి కబ్జాలు కాకుండా కట్టడి చేయాలని కోరుతూ కోరుట్ల తహశీల్దార్ ఇట్యాల వెంకట కిషన్ ను కోరినట్లు కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు చెన్న విశ్వనాథం, డాక్టర్ పేట భాస్కర్ లు తెలిపారు.
బుధవారం కోరుట్ల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ ను కలిసిన ఫోరమ్ నాయకులు మాట్లాడుతూ చెరువులు కుంటలు కబ్జా దారుల కబంధ హస్తాల్లో బంది అయిన వాటిని కాపాడి వాటికి హద్దులు నిర్ణయించి పట్టణ ప్రజలకు, గంగపుత్రులకు న్యాయం చేయాలని కోరుతూ గతంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కు చేసిన పిర్యాదు మేరకు రెవెన్యూశాఖ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు వెంటనే హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ అదేశాలు జారీ చేసిన లేటర్ ను తహశీల్దార్ కు అందించినట్లు ఫోరమ్ నాయకులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్ లు పేర్కొన్నారు. వారి వెంట నాయకులు ఎలిశేట్టి గంగారెడ్డి, ఎస్ రాజయ్యలు వున్నారు.