అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం: అనాథలకు అండగా నిలుస్తున్న అన్నం ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడికి కుటుంబ సభ్యుల తరహాలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించింది. నాలుగు రోజులైనా బంధువులు ఎవరూ రాకపోవడంతో టూటౌన్ పోలీసులు ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. స్పందించిన ఫౌండేషన్ ప్రతినిధులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బల్లేపల్లి వైకుంఠధామంలో సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular